చిత్రం: పెద్దరికం (౧౯౯౨)
సంగీతం: రాజ్ కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: బాలు, చిత్ర
ప్రియతమా ప్రియతమా తరగని పరువమా
తరలి రా తరలి రా
కన్నె గోదారిలా కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేర రావే
ప్రియతమా ప్రియతమా తరగని విరహమా
కదలి రా కదలి రా
మాఘమాసానివై మల్లెపూమాలవై
నిండు నా గుండెలో ఊయలూగ
నీ ఆశలన్నీ నా శ్వాసలైనా ఎంత మోహమో
నీ ఊసులన్నీ నా బాసలైనా ఎంత మౌనమో
ఎవరేమి అన్నా ఎదురీదనా
సుడిగాలినైనా ఒడి చేరనా
నీడల్లే నీ వెంట నేనుంటా నా ప్రేమసామ్రాజ్యమా
పెదవుల్ని తడితే పుడుతుంది తేనె తీయతీయగా
కౌగిట్లో పడితే కొడుతుంది వాన కమ్మకమ్మగా
వెన్నెలల మంచం వేసేయనా
ఏకాంత సేవ చేసేయనా
వెచ్చంగా చలి కాచుకోవాల నీ గుండెలోగిళ్ళలో
గమనించదగినవి:
౧ చేర రావే, సుడిగాలినైనా, వెన్నెలల మంచం వేసేయనా -- అన్నపుడు పూర్తివ్యావహారికంలో వ్రాయటం వీలుపడలేదు.
౨ నీ ఆశలన్నీ నా శ్వాసలైనా ఎంత మోహమో, నీ ఊసులన్నీ నా బాసలైనా ఎంత మౌనమో, కౌగిట్లో పడితే కొడుతుంది వాన కమ్మకమ్మగా -- అర్థం కాలేదు. :(
Sunday, July 24, 2011
Wednesday, December 29, 2010
మౌనమేల ఈ మధుమాసం
చిత్రం: పరుగో పరుగు (౧౯౯౩)
సాహిత్యం: జొన్నవిత్తుల
సంగీతం: రాజ్-కోటి
నేపథ్యగానం: బాలు, చిత్ర
మౌనమేల ఈ మధుమాసం
వేచి ఉన్నా నీ జతకోసం
అందుకున్నా నీ దరహాసం
ఆలపించా నీ అనురాగం
నీలికొండల్లో నీరెండై సోకింది కన్నెప్రేమ
రాగవీథుల్లో జాబిల్లై నవ్వింది ముద్దుగుమ్మ
కల్యాణి అందం కాశ్మీరగంధం
కోరింది నేడే కల్యాణబంధం
ఎన్నో జన్మాల బంధాలే ఎదలో సన్నాయి పాడే
సంధ్యారాగాల వర్ణాలే చెలితో దోబూచులాడే
కన్నుల్లో వెన్నెలలు నన్నల్లుకున్న వేళల్లో
గుండెల్లో గుమ్మెక్కె ఏముందో ఏమో ప్రేమల్లో
ఒయ్యారి మాట వలపు మంత్రం
చిన్నారి చెంత చిలిపి తంత్రం
కన్నె పూబంతి ఊహల్లో పెళ్లి మద్దెళ్లు మోగె
నిండు నూఱేళ్ల కౌగిళ్లు శాంతి సౌఖ్యాలు కోరె
సందెల్లో సింగారి సిందూరపూల చెక్కిళ్లు
పొద్దంతా ముద్దాడి వర్ధిల్లమంది వెయ్యేళ్లు
సయ్యాటలాడే సరసరాగం
ఉయ్యాలలూగే ప్రేమహృదయం
సాహిత్యం: జొన్నవిత్తుల
సంగీతం: రాజ్-కోటి
నేపథ్యగానం: బాలు, చిత్ర
మౌనమేల ఈ మధుమాసం
వేచి ఉన్నా నీ జతకోసం
అందుకున్నా నీ దరహాసం
ఆలపించా నీ అనురాగం
నీలికొండల్లో నీరెండై సోకింది కన్నెప్రేమ
రాగవీథుల్లో జాబిల్లై నవ్వింది ముద్దుగుమ్మ
కల్యాణి అందం కాశ్మీరగంధం
కోరింది నేడే కల్యాణబంధం
ఎన్నో జన్మాల బంధాలే ఎదలో సన్నాయి పాడే
సంధ్యారాగాల వర్ణాలే చెలితో దోబూచులాడే
కన్నుల్లో వెన్నెలలు నన్నల్లుకున్న వేళల్లో
గుండెల్లో గుమ్మెక్కె ఏముందో ఏమో ప్రేమల్లో
ఒయ్యారి మాట వలపు మంత్రం
చిన్నారి చెంత చిలిపి తంత్రం
కన్నె పూబంతి ఊహల్లో పెళ్లి మద్దెళ్లు మోగె
నిండు నూఱేళ్ల కౌగిళ్లు శాంతి సౌఖ్యాలు కోరె
సందెల్లో సింగారి సిందూరపూల చెక్కిళ్లు
పొద్దంతా ముద్దాడి వర్ధిల్లమంది వెయ్యేళ్లు
సయ్యాటలాడే సరసరాగం
ఉయ్యాలలూగే ప్రేమహృదయం
వర్గాలు:
1993,
చిత్ర,
జొన్నవిత్తుల,
బాలు,
రాజ్-కోటి
Wednesday, November 18, 2009
అందంగా లేనా అస్సలేం బాలేనా
చిత్రం: గోదావరి (౨౦౦౬)
వాక్కర్త: వేటూరి సుందరరామమూర్తి
గేయకర్త: కే ఎమ్ రాధాకృష్ణన్
గానం: ఉపద్రష్ట సునీత
అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడూ కాననా
అలుసైపోయానా అస్సలేమీ కానా వేషాలు చాల్లే పొమ్మనా
కనులు కలపవాయే మనసు తెలుపవాయే పెదవి కదపవాయే మాటవరసకే
కలికిచిలకనాయే కొలతనిదురలోయే మరవలేక నిన్నే మదనపడితినే
ఉత్తుత్తిగా చూసి ఉడికించవేల నువ్వొచ్చి అడగాలి అన్నట్టు నే బెట్టు చేశాను ఇన్నాళ్లుగా
నీకు మనసు ఇచ్చా ఇచ్చినపుడే నచ్చా కనులకబురు తెచ్చా తెలుసు నీకది
తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నటన ఏలది
వెన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తరిమేసి పోలేదుగా
వాక్కర్త: వేటూరి సుందరరామమూర్తి
గేయకర్త: కే ఎమ్ రాధాకృష్ణన్
గానం: ఉపద్రష్ట సునీత
అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడూ కాననా
అలుసైపోయానా అస్సలేమీ కానా వేషాలు చాల్లే పొమ్మనా
కనులు కలపవాయే మనసు తెలుపవాయే పెదవి కదపవాయే మాటవరసకే
కలికిచిలకనాయే కొలతనిదురలోయే మరవలేక నిన్నే మదనపడితినే
ఉత్తుత్తిగా చూసి ఉడికించవేల నువ్వొచ్చి అడగాలి అన్నట్టు నే బెట్టు చేశాను ఇన్నాళ్లుగా
నీకు మనసు ఇచ్చా ఇచ్చినపుడే నచ్చా కనులకబురు తెచ్చా తెలుసు నీకది
తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నటన ఏలది
వెన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తరిమేసి పోలేదుగా
వర్గాలు:
2006,
కే ఎమ్ రాధాకృష్ణన్,
వేటూరి,
సునీత
మనసా వాచా నిన్నే వలచా
చిత్రం: గోదావరి (౨౦౦౬)
వాక్కర్త: వేటూరి సుందరరామమూర్తి
గేయకర్త: కే ఎమ్ రాధాకృష్ణన్
గానం: ఉన్నికృష్ణన్, కే ఎస్ చిత్ర
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మఱిచా నీకై జీవించా
ఆ మాట దాచా కాలాలు వేచా నడిచై నే నీ నీడలా
చిన్నతప్పువని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమికన్నా తెల్లారైనా పున్నమికన్నా
మూగై(నూగై?) పోయా నేనిలా
నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా
రామునికోసం సీతలా
వాక్కర్త: వేటూరి సుందరరామమూర్తి
గేయకర్త: కే ఎమ్ రాధాకృష్ణన్
గానం: ఉన్నికృష్ణన్, కే ఎస్ చిత్ర
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మఱిచా నీకై జీవించా
ఆ మాట దాచా కాలాలు వేచా నడిచై నే నీ నీడలా
చిన్నతప్పువని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమికన్నా తెల్లారైనా పున్నమికన్నా
మూగై(నూగై?) పోయా నేనిలా
నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా
రామునికోసం సీతలా
వర్గాలు:
2006,
ఉన్నికృష్ణన్,
కే ఎమ్ రాధాకృష్ణన్,
చిత్ర,
వేటూరి
Wednesday, September 16, 2009
ஒரு நாள் போதுமா
படம்: திருவிளையாடல் (௧௯௬௫)
இசை: கே வி மகாதேவன்
பாடல்: கவியரசர் கண்ணதாசன்
பாடியவர்: மங்களம்பல்லி பாலமுரளீகிருஷ்ணா
ஒரு நாள் போதுமா இன்றொரு நாள் போதுமா
நான் பாட இன்றொரு நாள் போதுமா
நாதமா கீதமா அதை நான் பாட
இன்றொரு நாள் போதுமா
புதுநாதமா சங்கீதமா அதை நான் பாட
இன்றொரு நாள் போதுமா
ராகமா சுகராகமா கானமா தேவகானமா
என் கலைக்கு இந்த திருநாடு சமமாகுமா
நாதமா கீதமா அதை நான் பாட
இன்றொரு நாள் போதுமா
குழலென்றும் யாழென்றும் சிலர் கூறுவார்
என் குரல் கேட்டப் பின்னாலே அவர் மாறுவார்
அழியாத கலையென்று எனைப் பாடுவார்
எனையறியாமல் எதிர்ப்போர்கள் எழுந்தோடுவார்
இசை கேட்க எழுந்தோடி வருவாரன்றோ
எழுந்தோடி வருவாரன்றோ
இசை கேட்க எழுந்தோடி வருவாரன்றோ
எனக்கிணையாக தர்பாரில் எவரும் உண்டோ
தர்பாரில் எவரும் உண்டோ
எனக்கிணையாக தர்பாரில் எவரும் உண்டோ
கலையாத மோகனச் சுவை நானன்றோ
மோகனச் சுவை நானன்றோ
கலையாத மோகனச் சுவை நானன்றோ
கானடா என் பாட்டுத் தேனடா
இசை தெய்வம் நானடா
இசை: கே வி மகாதேவன்
பாடல்: கவியரசர் கண்ணதாசன்
பாடியவர்: மங்களம்பல்லி பாலமுரளீகிருஷ்ணா
ஒரு நாள் போதுமா இன்றொரு நாள் போதுமா
நான் பாட இன்றொரு நாள் போதுமா
நாதமா கீதமா அதை நான் பாட
இன்றொரு நாள் போதுமா
புதுநாதமா சங்கீதமா அதை நான் பாட
இன்றொரு நாள் போதுமா
ராகமா சுகராகமா கானமா தேவகானமா
என் கலைக்கு இந்த திருநாடு சமமாகுமா
நாதமா கீதமா அதை நான் பாட
இன்றொரு நாள் போதுமா
குழலென்றும் யாழென்றும் சிலர் கூறுவார்
என் குரல் கேட்டப் பின்னாலே அவர் மாறுவார்
அழியாத கலையென்று எனைப் பாடுவார்
எனையறியாமல் எதிர்ப்போர்கள் எழுந்தோடுவார்
இசை கேட்க எழுந்தோடி வருவாரன்றோ
எழுந்தோடி வருவாரன்றோ
இசை கேட்க எழுந்தோடி வருவாரன்றோ
எனக்கிணையாக தர்பாரில் எவரும் உண்டோ
தர்பாரில் எவரும் உண்டோ
எனக்கிணையாக தர்பாரில் எவரும் உண்டோ
கலையாத மோகனச் சுவை நானன்றோ
மோகனச் சுவை நானன்றோ
கலையாத மோகனச் சுவை நானன்றோ
கானடா என் பாட்டுத் தேனடா
இசை தெய்வம் நானடா
వర్గాలు:
1965,
కవియరసర్ కణ్ణదాసన్,
బాలమురళి,
మహాదేవన్
Friday, August 07, 2009
నిన్నే నిన్నే అల్లుకుని
చిత్రం: శశిరేఖాపరిణయం (౨౦౦౮)
సంగీతం: మణిశర్మ, విద్యాసాగర్
సాహిత్యం: చేంబోలు సీతారామశాస్త్రి
నేపథ్యగానం: కే ఎస్ చిత్ర
నిన్నే నిన్నే అల్లుకుని కుసుమించే గంధం నేనవనీ
నన్నే నీలో కలుపుకుని కొలువుంచే మంత్రం నీవవనీ
ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరి మురిసేలా
ప్రతి అడుగు కోవెలనౌతా నువ్వే నెలవు తీరేలా
నూరేళ్లు నన్ను నీ నివేదనవనీ
వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు మేను మరచిన వేళవు నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళిగట్టి ఏలవలసిన దొరవూ నువ్వే
రమణి చెరను దాటించే రామచంద్రుడా
రాధ మదిని వేధించే శ్యామసుందరా
మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా
ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా
గంగపొంగునాపగలిగిన కైలాసమా
కొంగుముళ్లలోన ఒదిగిన వైకుంఠమా
ప్రాయమంత కరిగించి ధారపోయనా
ఆయువంత వెలిగించి హారతీయనా
సంగీతం: మణిశర్మ, విద్యాసాగర్
సాహిత్యం: చేంబోలు సీతారామశాస్త్రి
నేపథ్యగానం: కే ఎస్ చిత్ర
నిన్నే నిన్నే అల్లుకుని కుసుమించే గంధం నేనవనీ
నన్నే నీలో కలుపుకుని కొలువుంచే మంత్రం నీవవనీ
ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరి మురిసేలా
ప్రతి అడుగు కోవెలనౌతా నువ్వే నెలవు తీరేలా
నూరేళ్లు నన్ను నీ నివేదనవనీ
వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు మేను మరచిన వేళవు నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళిగట్టి ఏలవలసిన దొరవూ నువ్వే
రమణి చెరను దాటించే రామచంద్రుడా
రాధ మదిని వేధించే శ్యామసుందరా
మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా
ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా
గంగపొంగునాపగలిగిన కైలాసమా
కొంగుముళ్లలోన ఒదిగిన వైకుంఠమా
ప్రాయమంత కరిగించి ధారపోయనా
ఆయువంత వెలిగించి హారతీయనా
వర్గాలు:
2008,
చిత్ర,
మణిశర్మ,
విద్యాసాగర్,
సిరివెన్నెల
Friday, July 24, 2009
తనివి తీరలేదే
చిత్రం: గూడుపుఠాణీ (1972)
సంగీతం: ఎస్ పీ కోదండపాణి
సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్య
నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యము, సుశీల
తనివి తీరలేదే
నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
చెలియా ఓ చెలియా
ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే
ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే
అందని అందాల అంచుకే చేరిననూ
విరిసిన పరువాల లోతులే చూసిననూ
తనివి తీరలేదే
నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
ప్రియతమా ఓ ప్రియతమా
ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి
కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నములు వస్తేనేమి
వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ
సంగీతం: ఎస్ పీ కోదండపాణి
సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్య
నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యము, సుశీల
తనివి తీరలేదే
నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
చెలియా ఓ చెలియా
ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే
ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే
అందని అందాల అంచుకే చేరిననూ
విరిసిన పరువాల లోతులే చూసిననూ
తనివి తీరలేదే
నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
ప్రియతమా ఓ ప్రియతమా
ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి
కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నములు వస్తేనేమి
వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ
రాశాను ప్రేమలేఖలెన్నో
చిత్రం: శ్రీదేవి (1970)
సంగీతం : జీ కే వేంకటేశ్
సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్య
నేపథ్యగానం: బాలు, సుశీల
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్నీ నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే
నీ నవ్వులే
కొమ్మల్లో కోయిలమ్మ కోయన్నదీ
నా మనసు నిన్నే తలచి ఓయన్నదీ
మురిపించే ముద్దు గులాబీ మొగ్గేసింది
చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది
నీ అడుగుల సవ్వడి ఉంది నా గుండెలో
నీ చల్లని రూపం ఉంది నా కనులలో
నాలోని సోయగమంతా విరబూచెలే
మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే
అందాల పయ్యెద నేనై ఆటాడనా
కురులందు కుసుమము నేనై చెలరేగనా
నీ చేతుల వీణను నేనై పాట పాడనా
నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా
సంగీతం : జీ కే వేంకటేశ్
సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్య
నేపథ్యగానం: బాలు, సుశీల
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్నీ నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే
నీ నవ్వులే
కొమ్మల్లో కోయిలమ్మ కోయన్నదీ
నా మనసు నిన్నే తలచి ఓయన్నదీ
మురిపించే ముద్దు గులాబీ మొగ్గేసింది
చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది
నీ అడుగుల సవ్వడి ఉంది నా గుండెలో
నీ చల్లని రూపం ఉంది నా కనులలో
నాలోని సోయగమంతా విరబూచెలే
మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే
అందాల పయ్యెద నేనై ఆటాడనా
కురులందు కుసుమము నేనై చెలరేగనా
నీ చేతుల వీణను నేనై పాట పాడనా
నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా
వర్గాలు:
1970,
జీ కే వేంకటేశ్,
దాశరథి,
బాలు,
సుశీల
ఈ సంజెలో కెంజాయలో
చిత్రం: మూగప్రేమ (1970)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గా సుప్రసిద్ధులైన కిళాంబి వేంకటనరసింహాచార్యులు
నేపథ్యగానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యము, పి సుశీల
ఈ సంజెలో కెంజాయలో
చిరుగాలుల కెరటాలలో
ఏ మల్లి మరులెల్ల ఎగదోసెనో
ఏ రాజు ఎదలోతు చవిచూసెనో
ఈ మేఘమే రాగ స్వరమో
ఆ రాగమే మూగ పదమో
ఈ చెంగు ఏ వయసు పొంగో
ఆ పొంగు ఆపేది ఎవరో
ఎవరో అదెవరో
రెప రెప రెప రెప రెప రెప
పులకించి ఒక కన్నె మనసు
పలికింది తొలి తీపి పలుకు
చిలికింది అది లేత కవిత
తొణికింది తనలోని మమత
మదిలో మమతలో
రిమ ఝిమ రిమ ఝిమ రిమ ఝిమ
నా కళ్లలో ఇల్లరికము
నా గుండెలో రాచరికము
ఈ వేళ నీవేలే నిజము
నేనుంది నీలోన సగము
సగమే జగముగా
కల కల కల కిల కిల కిల
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గా సుప్రసిద్ధులైన కిళాంబి వేంకటనరసింహాచార్యులు
నేపథ్యగానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యము, పి సుశీల
ఈ సంజెలో కెంజాయలో
చిరుగాలుల కెరటాలలో
ఏ మల్లి మరులెల్ల ఎగదోసెనో
ఏ రాజు ఎదలోతు చవిచూసెనో
ఈ మేఘమే రాగ స్వరమో
ఆ రాగమే మూగ పదమో
ఈ చెంగు ఏ వయసు పొంగో
ఆ పొంగు ఆపేది ఎవరో
ఎవరో అదెవరో
రెప రెప రెప రెప రెప రెప
పులకించి ఒక కన్నె మనసు
పలికింది తొలి తీపి పలుకు
చిలికింది అది లేత కవిత
తొణికింది తనలోని మమత
మదిలో మమతలో
రిమ ఝిమ రిమ ఝిమ రిమ ఝిమ
నా కళ్లలో ఇల్లరికము
నా గుండెలో రాచరికము
ఈ వేళ నీవేలే నిజము
నేనుంది నీలోన సగము
సగమే జగముగా
కల కల కల కిల కిల కిల
అదిగో నవలోకం
చిత్రం: వీరాభిమన్యు (1965)
సంగీతం: కే వీ మహాదేవన్
సాహిత్యం: ఆరుద్ర అనబడే భాగవతుల సదాశివశంకరశాస్త్రి
నేపథ్యగానం: ఘంటసాల వేంకటేశ్వరరావు, పి సుశీల
అదిగో నవలోకం వెలసే మనకోసం
నీలి నీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోర వలపు సీమలో ఆగుదాం
ఎచట సుఖముందో ఎచట సుధగలదో
అచటె మనముందామా
పారిజాత సుమ దళాల పానుపు
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు
ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవు సుమా హద్దులు
ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో
అచటె మనముందామా
సంగీతం: కే వీ మహాదేవన్
సాహిత్యం: ఆరుద్ర అనబడే భాగవతుల సదాశివశంకరశాస్త్రి
నేపథ్యగానం: ఘంటసాల వేంకటేశ్వరరావు, పి సుశీల
అదిగో నవలోకం వెలసే మనకోసం
నీలి నీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోర వలపు సీమలో ఆగుదాం
ఎచట సుఖముందో ఎచట సుధగలదో
అచటె మనముందామా
పారిజాత సుమ దళాల పానుపు
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు
ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవు సుమా హద్దులు
ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో
అచటె మనముందామా
Subscribe to:
Posts (Atom)