Saturday, December 23, 2006

అందమే ఆనందం

చిత్రం: బ్రతుకు తెరువు
సంగీతం: ఘంటసాల వేంకటేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
నేపథ్య గానం: ఘంటసాల వేంకటేశ్వరరావు

అందమే ఆనందం
అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం

పడమట సంధ్యారాగం కుడియెడమల కుసుమ పరాగం
పడమట సంధ్యారాగం కుడియెడమల కుసుమ పరాగం
ఒడిలో చెలి మోహన రాగం
ఒడిలో చెలి మోహన రాగం
జీవితమే మధురానురాగం
జీవితమే మధురానురాగం
అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం

పడిలేచే కడలి తరంగం
ఓ పడిలేచే కడలి తరంగం
వడిలో జడిసిన సారంగం
పడిలేచే కడలి తరంగం
వడిలో జడిసిన సారంగం
సుడిగాలిలో ఓ
సుడిగాలిలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటకరంగం
జీవితమే ఒక నాటకరంగం
అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం

శ్రీరామ జయ రామ సీతారామ

చిత్రం: ముత్యాల ముగ్గు (1975)
సంగీతం: కే వీ మహాదేవన్
సాహిత్యం: ???
నేపథ్య గానం: మంగళంపల్లి బాల మురళీకృష్ణ

శ్రీరామ జయ రామ సీతారామ
శ్రీరామ జయ రామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతారామ

నీ దివ్యనామం మధురాతిమధురం
నేనెన్న తరమా నీ నామ మహిమ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతారామ

చరణాలు కొలిచే నగుమోము జూచే

చరణాలు కొలిచే నగుమోము జూచే
సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా
భక్తి సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా
నీ కీర్తి చాటగా నా కోసమే నీవు అవతారమెత్తేవు సుగుణాభిరామా
శ్రీరామ జయ రామ సీతా రామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతా రామ

నిలకడ లేని అల కోతి మూకచే
నిలకడ లేని అల కోతి మూకచే
కడలిపై వారధి కట్టించినావే
పెను కడలిపై వారధి కట్టించినావే
నీ పేరు జపియించ తీరేను కోర్కెలు
నీ పేరు జపియించ తీరేను కోర్కెలు
నేనెంత నుతియింతు నా భాగ్య గరిమ
శ్రీరామ జయ రామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతారామ

వసంత గాలికి వలపులు రేగ

చిత్రం: శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
నేపథ్య గానం: మంగళంపల్లి బాల మురళీకృష్ణ, యస్ జానకి

వసంత గాలికి వలపులు రేగ వరించు బాలిక మయూరి కాగ
తనువు మనసు ఊగి తూగి ఒక మైకం కలిగేనులే
ఈ మహిమ నీదేనులే ప్రేమతీరు ఇంతేనులే

రవంత సోకిన చల్లని గాలికి మరింత కోరిన వసంతుడనగా
తనువు మనసు ఊగి తూగి ఈ లోకం మారేనులే
ఈ మహిమ నీదేనులే ఆహా భలే హాయిలే

విలాస మాధురి వెన్నెల కాగా విహార వీణలు విందులు కాగా
ఏకాంతంలో నీవూ నేనే ఒక స్వర్గం కనుపించెనే
ఈ మహిమ నీదేనులే ప్రేమ తీరు ఇంతేనులే

మౌనమే నీ భాష ఓ మూగ మనసా

చిత్రం: గుప్పెడు మనసు (1979)
సంగీతం: యమ్మెస్ విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: మంగళంపల్లి బాల మురళీకృష్ణ

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో యెందుకు వగచేవో
ఎందుకు రగిలేవో యేమై మిగిలేవో
ఎందుకు రగిలేవో యేమై మిగిలేవో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు యున్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

Friday, December 22, 2006

సుందరి నేనే నువ్వంట

చిత్రం: దళపతి(1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
నేపథ్య గానం: బాలసుబ్రహ్మణ్యం & చిత్ర

సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా
గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా

అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా
మధురాల మధువులు చింది చల్లని ప్రేమే మాయమా

రేపవలు నిద్దరలోను యద నీ తోడే కోరును
యుద్ధాన యేమైనా నా ఆత్మే నిన్నే చేరును
యద తెలుపు ఈ వేళ యేల ఈ శోధన
జాబిలిని నీవడుగు - తెలుపు నా వేదన
నాలో ప్రేమే మరిచావు
ప్రేమే నన్నే గెలిచేనే
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా
సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా

పువ్వులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే
ఊహలే పూలై తోచు నీ యద మాటున చేరితే

మాసాలు వారాలౌను నీవూ నేనూ కూడితే
వారాలు మాసాలౌను బాటే మారి సాగితే
పొంగునే బంధాలే నీ దరి చేరితే
గాయాలు ఆరేను నీ యెదుట వుంటే
నీవే కదా నా ప్రాణం
నీవే కదా నా లోకం
సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా
గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా