Sunday, April 29, 2007

తిలోత్తమా

చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
నేపథ్య గానం: హరిహరన్, సుజాత

తిలోత్తమా ప్రియ వయ్యారమా
ప్రభాతమా శుభ వసంతమా
నే మోయలేనంటూ హృదయాన్ని అందించా
నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా
ఏ దారిలో సాగుతున్నా యెద నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో యెప్పుడైనా మది నీ వూహలో వూగుతోంది

పెదవే వో మధుర కవిత చదివే
అడుగే నా గడపనొదిలి కదిలే
ఇన్నాళ్ళు లేని యీ కొత్త బాణీ యివ్వళే మనకెవరు నేర్పారమ్మా
ఈ మాయ చేసింది ప్రేమే
ప్రియా! ప్రేమంటే వొకటైన మనమే

కలలే నా యెదుట నిలిచె నిజమై
వలపే నా వొడికి దొరికె వరమై
ఏ రాహువైనా ఆషాఢమైనా యీ బాహుబంధాన్ని విడదీయునా
నీ మాటలె వేదమంత్రం
చెలి! నువ్వన్నదే నా ప్రపంచం

2 అభిప్రాయాలు:

Reddy said...

Writer Veturi anukunta?

రాఘవ said...

కాదండీ, చంద్రబోస్ వ్రాసినదే.