Saturday, May 12, 2007

నెరజాణనులే వరవీణనులే

చిత్రం: ఆదిత్య 369
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
నేపథ్య గానం: కృష్ణవేణి (జిక్కి), బాలు & శైలజ

నెరజాణనులే వరవీణనులే గిలిగించితాలలో
జాణనులే మృదుపాణినిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవి గని మొగ్గగ నీ మోజు పడిన వేళలో

మోమటు దోచి మురిపెము పెంచే లాహిరిలో
మూగవుగానే మురళిని వూదే వైఖరిలో
చెలి వొంపులలో హంపికలా వూగే వుయ్యాల
చెలి పయ్యదలో తుంగ అలా పొంగే యీ వేళ
మరి అందుకు విరి పానుపు సవరించవేమిరా

చీకటి కోపం చెలిమికి లాభం... కౌగిలిలో
వెన్నెల తాపం వయసుకు ప్రాణం యీ చలిలో
చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ
తొలి సోయగమే ఓ సగము ఇవ్వాలీవేళ
పరువానికి పగవానికి వొక న్యాయమింక సాగునా

నెరజాణవులే వరవీణవులే గిలిగించితాలలో
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

0 అభిప్రాయాలు: