Monday, June 11, 2007

ప్రేమంటే యేమిటంటే

చిత్రం: శీను (1999)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: వెన్నెలకంటి
నేపథ్య గానం: హరిహరన్,సుజాత

ప్రేమంటే యేమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే యేమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ఇదివరకు తెలియంది యీ అనుభవం
ఎద మేలుకొలిపింది యీ పరిచయం
ఓ...

నీ కళ్ళ వాకిళ్లలో తలుపు తెరిచెను ప్రేమ
మోహాల ముంగిళ్లలో వలపు కురిసెను ప్రేమ
ఈనాడే తెలిసింది తొలిసారిగా యెంత తీయంది ప్రేమని
ఆకాశ దీపాలు యిల చేరగా తెర తీసింది ఆమని
ఇది సంగీతమో తొలి సంకేతమో
ఇది ప్రియగీతమో మధు జలపాతమో

ఏనాడు యే దేవతో మనను కలిపిన వేళ
ఈనాడు యీ దేవితో మనసు తెలిపెను చాల
కాలాలు వొకసారి ఆగాలిలే మన తొలిప్రేమ సాక్షిగా
లోకాలు మన వెంట సాగాలిలే మన ప్రేమికుల తోడుగా
ఇది ఆలాపనో మది ఆరధనో
మన సరసాలకే తొలి సంకీర్తనో

0 అభిప్రాయాలు: