చిత్రం: విలన్ (2003)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువనచంద్ర
నేపథ్య గానం: ఉన్నికృష్ణన్,సుజాత
నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా
నీ కనుల వొడిలో నే కలనా కాటుకనా
నీ పెదవి తడిలో నే ముద్దునా మధురిమనా
నీ సొగసు పొగడ నే కవినా కల్పననా
నే బిడియపడితే నువు గిలివా చెక్కిలివా
నే విరహమైతే నువు రతివా కోరికవా
నే పాపనైతే నువు వొడివా వూయలవా
నే నిదురనైతే నువు కలవా కౌగిలివా
నే హృదయమైతే నువు వూపిరివా సవ్వడివా
నే గగనమైతే వేసవివా వెన్నెలవా
నే నదిని ఐతే నువు అలవా అలజడివా
నే విందునైతే నువు రుచివా ఆకలివా
నే భాషనైతే నువు స్వరమా అక్షరమా
నే పాటనైతే నువు శృతివా పల్లవివా
నే తోటనైతే ఆమనివా కోయిలవా
నే జంటకొస్తే నువు ఋషివా మదనుడివా
నీ యెదుటపడితే పిలిచేవా వలచేవా
నిను నేను పిలువకుంటే నువు అలగవా అడగవా
నను ప్రేమించమంటే తప్పా వొప్పా
నీలోన వుంది నేనే కదా
నాలోన వుంది నీవే కదా
ఎదలోని వలపే ఎదురెదురు చూసి వానలాగ కురిసేనులే
ఈ పాట తమిళం(தமிழ்) version -- ఉన్ సమయల్ అరయిల్ (உன் ஸமயல் அரயில்) -- యిక్కడ చూడండి.
Monday, June 11, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 అభిప్రాయాలు:
Post a Comment