చిత్రం: కనులు మూసినా నీవాయే (2002)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
నేపథ్య గానం: హరిహరన్
చిన్నినవ్వు జల్లిపోవే ప్రియతమా
చందనాలు చిందిపోవే ప్రాణమా
బిందువై నను తాకిపోవే ప్రియతమా
సింధువై మది నిండిపోవే ప్రాణమా
హృదివాణివై హృదయానివై
ఈ హాయిలో కిరణానివై
నా కంటి పాపల్లో దీపాల వెలుగై
నా గుండె లోతుల్లో స్వప్నాల జడివై
నిను చూస్తూ కూర్చుంటే వో సంబరం
నా చెంతే వున్నట్టు ఆ అంబరం
నీ రూపు కలలెన్నో వెదజల్లి పోయింది
ఎద యేంటి మేఘంలా ఎగిరెళ్ళి పోతోంది
సఖి నువ్వే నాలోని అలజడికే ఆకారం
నువు కాదా లోలోనే తొలి ప్రేమకు శ్రీకారం
నాలోని భావాలు యిక తెలిపేదెలా
ప్రతిరోజు నిదురల్లో వో కలవరం
కెరటాలై పొంగింది మది సాగరం
మనసేమో చిత్రంగా నిన్నేలే అడిగింది
ఎద యేమో ఆత్రంగా నీకోసం వెతికింది
అణువణువును జత చేసి నిర్మించా గోపురమే
నువు చిందే చిరునవ్వే నా పాలిట ప్రియవరమే
నాలోని భావాలు యిక తెలిపేదెలా
Saturday, June 23, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 అభిప్రాయాలు:
Post a Comment