చిత్రం: ఒట్టేసిచెబుతున్నా (2003)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: ?
నేపథ్య గానం: గోపాల్, శ్రీనిధి
ఒట్టేసిచెబుతున్నా వింటున్నావా ఓ మైనా నువ్వంటే నేనేనని
అడుగేసి వస్తున్నా యెందాకైనా యేవైఁనా నీ వెంటే వుండాలని
తీరిందమ్మా ఆరాటం దొరికిందమ్మా ఆధారం
నీవల్లే మారిందే నా జాతకం
అందిందమ్మో అనుబంధం యేవో జన్మల ఋణబంధం
నీ వొళ్ళో వాలిందే నా జీవితం
వెళ్ళేటిదారుల్లోన నీడుంటే చాలనుకుంటే బంగరుమేడై కలిసొచ్చావే
వేచేటి కన్నుల్లోన కలలుంటే చాలనుకుంటే కమ్మని నిజమై కనిపించావే
దీవెన చాలని అనుకుంటే దైవం అందెనే
పూజకు రమ్మని పిలుపిస్తే ప్రాణం పంచెనే
నా రాతే మార్చేసే నా గీతే దిద్దేసే భామిని వుండగ బ్రహ్మెందుకో
నీ లేతపాదాలంటే ధూళైతే చాలనుకుంటే పాపిటతిలకమే చేశావమ్మా
నీ పెరటితోటల్లోన గాలైతే చాలనుకుంటే వూపిరిలో నను నిలిపావమ్మా
నాలో నేడే వెలిగిందే ఆశాదీపము
ప్రేమే మనకు అందించే ఆశీర్వాదము
నీ మెళ్ళో ముళ్ళేసి పల్లెల్లో యిల్లేసి జతపడి బ్రతకని జన్మెందుకో
Monday, September 10, 2007
Subscribe to:
Post Comments (Atom)
5 అభిప్రాయాలు:
అరసున్నని ఈ విధంగా రాయవచ్చు.
లేఖినిలో: @M
ఇన్‌స్క్రిప్టులో: X
థేఁన్క్స్ :)
ఈ పాట నాకు చాలా ఇష్టం. రాగం ఆరభి చాయల్లో సాగుతుంది. విద్యాసాగర్ నీకు టోపీ తీతలు. మంచి పాటను గుర్తు చేసినందుకు కృలు.
:)
ఇది ఆరభి కాదండీ, శుద్ధసావేరి. శుద్ధసావేరి ఆరోహణలో ఆరభిలాగానే వుంటుంది. స రి మ ప ద స. అవరోహణలో మాత్రం స ద ప మ రి స అని వస్తుంది. అదే ఆరభి అయితే స ని ద ప మ గ రి స అని వస్తుంది.
Post a Comment