చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
నేపథ్య గానం: హరిహరన్, సుజాత
తిలోత్తమా ప్రియ వయ్యారమా
ప్రభాతమా శుభ వసంతమా
నే మోయలేనంటూ హృదయాన్ని అందించా
నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా
ఏ దారిలో సాగుతున్నా యెద నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో యెప్పుడైనా మది నీ వూహలో వూగుతోంది
పెదవే వో మధుర కవిత చదివే
అడుగే నా గడపనొదిలి కదిలే
ఇన్నాళ్ళు లేని యీ కొత్త బాణీ యివ్వళే మనకెవరు నేర్పారమ్మా
ఈ మాయ చేసింది ప్రేమే
ప్రియా! ప్రేమంటే వొకటైన మనమే
కలలే నా యెదుట నిలిచె నిజమై
వలపే నా వొడికి దొరికె వరమై
ఏ రాహువైనా ఆషాఢమైనా యీ బాహుబంధాన్ని విడదీయునా
నీ మాటలె వేదమంత్రం
చెలి! నువ్వన్నదే నా ప్రపంచం
Sunday, April 29, 2007
Saturday, April 28, 2007
ఇది స-రి-గ-మ యెరుగని రాగం
చిత్రం: హై హై నాయకా(1988)
సంగీతం: సురేష్ చంద్ర
సాహిత్యం: జొన్నవిత్తుల (?)
నేపథ్య గానం: బాలు & జానకి
ఇది స-రి-గ-మ యెరుగని రాగం
ఇది భాషే లేని భావము
ప్రేమ గానము
ఇది యిదియని తెలియని భావం
ఇది పలికే భాషే మౌనము
ప్రేమ గానము
మణిలాగ రమణిలాగ
సుధచిందే వసుధనందే
అరవిరిసే ఆశల ఆమని...
అనురాగం తనువు వూగ
లతలోని కలతదీర
జతజేర రారా లాహిరి...
కలహంసలా విరిధనువులా రావే వధువులా...
గిలిగింత రగిలినంత
రసగీతి సరసరీతి
రవళించగ రారా మురళిలా...
వనరాణి కవనవాణి
కలవాణి కలలకేళి
చెలి వెన్నెల విరిసే వేళలో
నిను చేరగా తగు సమయమే రానీ శుభమని...
సంగీతం: సురేష్ చంద్ర
సాహిత్యం: జొన్నవిత్తుల (?)
నేపథ్య గానం: బాలు & జానకి
ఇది స-రి-గ-మ యెరుగని రాగం
ఇది భాషే లేని భావము
ప్రేమ గానము
ఇది యిదియని తెలియని భావం
ఇది పలికే భాషే మౌనము
ప్రేమ గానము
మణిలాగ రమణిలాగ
సుధచిందే వసుధనందే
అరవిరిసే ఆశల ఆమని...
అనురాగం తనువు వూగ
లతలోని కలతదీర
జతజేర రారా లాహిరి...
కలహంసలా విరిధనువులా రావే వధువులా...
గిలిగింత రగిలినంత
రసగీతి సరసరీతి
రవళించగ రారా మురళిలా...
వనరాణి కవనవాణి
కలవాణి కలలకేళి
చెలి వెన్నెల విరిసే వేళలో
నిను చేరగా తగు సమయమే రానీ శుభమని...
వర్గాలు:
1988,
జానకి,
జొన్నవిత్తుల,
బాలు,
సురేశ్ చంద్ర
Friday, April 20, 2007
అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నది
చిత్రం: ప్రేమించుకుందాం... రా! (1997)
సంగీతం: ఎన్ మహేశ్
సాహిత్యం: "సిరివెన్నెల" సీతారామశాస్త్రి
నేపథ్య గానం: బాలు & చిత్ర
అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నది
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది
ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నది
ప్రేమించుకుందాం... రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది
ప్రతి జన్మ నీతోనే ముడేశాడు బ్రహ్మ
అనే నమ్మి నీ పేరే జపించానులేమ్మా
అదే పాట నా దాకా ఏలా చేరెనమ్మా
ప్రతీ బాట నా వైపే నిన్నే పంపెనమ్మా
నిరంతరం నీ వూసేదో నను రమ్మన్నది
ప్రతీ క్షణం నీ ధ్యాసేగా కలవరించి వరించి రప్పించుకున్నది
అలల్లాంటి యీ రాగం నువ్వే నేర్పలేదా
తుఫానంటి యీ వేగం నువ్విచ్చింది కాదా
వెలేవేసి లోకాన్ని యెటో వెళ్లిపోదాం
ఏదో చేసి కాలాన్ని అలా ఆగమందాం
రహస్య రాజ్యం చేరే జత కథే యిది
సుఖాల తీరం కోరే మన ప్రయాణమివాళ ఫలించు క్షణమిది
సంగీతం: ఎన్ మహేశ్
సాహిత్యం: "సిరివెన్నెల" సీతారామశాస్త్రి
నేపథ్య గానం: బాలు & చిత్ర
అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నది
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది
ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నది
ప్రేమించుకుందాం... రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది
ప్రతి జన్మ నీతోనే ముడేశాడు బ్రహ్మ
అనే నమ్మి నీ పేరే జపించానులేమ్మా
అదే పాట నా దాకా ఏలా చేరెనమ్మా
ప్రతీ బాట నా వైపే నిన్నే పంపెనమ్మా
నిరంతరం నీ వూసేదో నను రమ్మన్నది
ప్రతీ క్షణం నీ ధ్యాసేగా కలవరించి వరించి రప్పించుకున్నది
అలల్లాంటి యీ రాగం నువ్వే నేర్పలేదా
తుఫానంటి యీ వేగం నువ్విచ్చింది కాదా
వెలేవేసి లోకాన్ని యెటో వెళ్లిపోదాం
ఏదో చేసి కాలాన్ని అలా ఆగమందాం
రహస్య రాజ్యం చేరే జత కథే యిది
సుఖాల తీరం కోరే మన ప్రయాణమివాళ ఫలించు క్షణమిది
వర్గాలు:
1997,
ఎన్ మహేశ్,
చిత్ర,
బాలు,
సిరివెన్నెల
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: మరకతమణి కీరవాణి
నేపథ్య గానం: బాలు & చిత్ర
కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
తమకంతో పాలబుగ్గ తొలిముద్దును కోరెను
తడియారని పెదవులపై
తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటే
మోహపు తెరలిక తొలిగేనా
చలి చలి చిరు గాలులు గిలిగింత రేపుతుంటే
ఆశల అల్లరి అణిగేనా
పదాలతోనే వరించనా
సరాగ మాలై తరించనా
స్వరాలతోనే స్పృశించనా
సుఖాల వీణ శృతించనా
ఆ వెన్నెల నీ కన్నుల
రేపెక్కిన ఆ కోరిక
పొగలై సెగలై యెదలో రగిలిన క్షణమే
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మదనుడి మలుపులు తెలిసెననీ
తెల్లారనీకే వొయ్యారమా
అల్లాడిపోయే యీ రేయిని
సవాలు చేసే శృంగారమా
సంధించమాకే వో హాయిని
ఆ మల్లెల కేరింతలు
నీ నవ్వుల లాలింతలు
వలలై అలలై వొడిలో వొదిగిన క్షణమే
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: మరకతమణి కీరవాణి
నేపథ్య గానం: బాలు & చిత్ర
కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
తమకంతో పాలబుగ్గ తొలిముద్దును కోరెను
తడియారని పెదవులపై
తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటే
మోహపు తెరలిక తొలిగేనా
చలి చలి చిరు గాలులు గిలిగింత రేపుతుంటే
ఆశల అల్లరి అణిగేనా
పదాలతోనే వరించనా
సరాగ మాలై తరించనా
స్వరాలతోనే స్పృశించనా
సుఖాల వీణ శృతించనా
ఆ వెన్నెల నీ కన్నుల
రేపెక్కిన ఆ కోరిక
పొగలై సెగలై యెదలో రగిలిన క్షణమే
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మదనుడి మలుపులు తెలిసెననీ
తెల్లారనీకే వొయ్యారమా
అల్లాడిపోయే యీ రేయిని
సవాలు చేసే శృంగారమా
సంధించమాకే వో హాయిని
ఆ మల్లెల కేరింతలు
నీ నవ్వుల లాలింతలు
వలలై అలలై వొడిలో వొదిగిన క్షణమే
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
Tuesday, April 17, 2007
సొగసు చూడ తరమా
చిత్రం: సొగసు చూడ తరమా (1995)
సంగీతం: రమణి-ప్రసాద్
సాహిత్యం: "సిరివెన్నెల" సీతారామ శాస్త్రి
నేపథ్య గానం: పద్మశ్రీ కట్టాసెరి జోసెఫ్ యేసుదాస్
సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా
మరుని నారి నారిగ మారి మదిని నాటు విరిశరమా
కులుకే సుప్రభాతాలై కునుకే స్వప్నగీతాలై
ఉషా కిరణము నిషా తరుణము
కలిసె కలికి మేనిగా రతికాంతుని కొలువుగా
వెలసే చెలి చిన్నెలలో
పలుకా చైత్ర రాగాలే అలకా గ్రీష్మ తాపాలే
మదే కరిగితే అదే మధుఝరి
చురుకు వరద గౌతమి చెలిమి శరత్పౌర్ణమి
అతివే అన్ని ఋతువులయ్యే
సంగీతం: రమణి-ప్రసాద్
సాహిత్యం: "సిరివెన్నెల" సీతారామ శాస్త్రి
నేపథ్య గానం: పద్మశ్రీ కట్టాసెరి జోసెఫ్ యేసుదాస్
సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా
మరుని నారి నారిగ మారి మదిని నాటు విరిశరమా
కులుకే సుప్రభాతాలై కునుకే స్వప్నగీతాలై
ఉషా కిరణము నిషా తరుణము
కలిసె కలికి మేనిగా రతికాంతుని కొలువుగా
వెలసే చెలి చిన్నెలలో
పలుకా చైత్ర రాగాలే అలకా గ్రీష్మ తాపాలే
మదే కరిగితే అదే మధుఝరి
చురుకు వరద గౌతమి చెలిమి శరత్పౌర్ణమి
అతివే అన్ని ఋతువులయ్యే
వర్గాలు:
1995,
యేసుదాస్,
రమణి-ప్రసాద్,
సిరివెన్నెల
Subscribe to:
Posts (Atom)