Monday, May 28, 2007

కలికి చిలకల కొలికి మాకు మేనత్త

చిత్రం: సీతారామయ్యగారి మనవరాలు (1991)
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: మరకతమణి కీరవాణి
నేపథ్య గానం: చిత్ర

కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు యెరుగని పసిపంకజాక్షి
మేనాలు తేలేని మేనకోడల్ని
అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్య
మాయింటికంపించవయ్య మావయ్యా

ఆ చేయి యీ చేయి అద్దగోడలికి
ఆ మాట యీ మాట పెద్దకోడలికి
నేటి అత్తమ్మా నాటి కోడలివి
తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే
పూలల్లొ దారమై పూజలే చేసే
నీ కంటి పాపలా కాపురం చేసే
మా చంటి పాపను మన్నించి పంపు

మసకబడితే నీకు మల్లెపూదండ
తెలవారితే నీకు తేనె నీరెండ
ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మలపంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది
పుట్టింటికే మనసు పరుగుతీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయ్యోధ్యనేలేటి సాకేతరామా

Saturday, May 12, 2007

అలివేణి ఆణిముత్యమా

చిత్రం: ముద్ద మందారం
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
నేపథ్య గానం: బాలు & జానకి

అలివేణి ఆణిముత్యమా
నీ కంట నీటి ముత్యమా?
ఆవిరి చిగురు ఇది ఊపిరి కబురు
స్వాతి వాన లేత యెండలో
జాలి నవ్వు జాజి దండలు
అలివేణి ఆణిముత్యమా
నా పరువాల ప్రాణ ముత్యమా
జాబిలి చలువు ఇది వెన్నెల కొలువు
స్వాతి వాన లేత యెండలో
జాజిమల్లి పూల దండలో

కుదురైన బొమ్మకి కులుకు మల్లె రెమ్మకి
నుదుట ముద్దు పెట్టనా వొట్టుగా
వొద్దంటే వొట్టుగా...
అందాల అమ్మకి కుందనాల కొమ్మకి
అడుగు మడుగు లొత్తనా మెత్తగా
ఔనంటే తప్పుగా...

పొగడలేని ప్రేమకి పొన్న చెట్టు నీడకి
పొగడదండలల్లుకోనా పూజగా
పులకింతల పూజగా...
తొలి జన్మల నోముకి దొర నవ్వుల సామికి
చెలిమై నేనుండిపోనా చల్లగా
మరుమల్లెలు చల్లగా...

నెరజాణనులే వరవీణనులే

చిత్రం: ఆదిత్య 369
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
నేపథ్య గానం: కృష్ణవేణి (జిక్కి), బాలు & శైలజ

నెరజాణనులే వరవీణనులే గిలిగించితాలలో
జాణనులే మృదుపాణినిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవి గని మొగ్గగ నీ మోజు పడిన వేళలో

మోమటు దోచి మురిపెము పెంచే లాహిరిలో
మూగవుగానే మురళిని వూదే వైఖరిలో
చెలి వొంపులలో హంపికలా వూగే వుయ్యాల
చెలి పయ్యదలో తుంగ అలా పొంగే యీ వేళ
మరి అందుకు విరి పానుపు సవరించవేమిరా

చీకటి కోపం చెలిమికి లాభం... కౌగిలిలో
వెన్నెల తాపం వయసుకు ప్రాణం యీ చలిలో
చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ
తొలి సోయగమే ఓ సగము ఇవ్వాలీవేళ
పరువానికి పగవానికి వొక న్యాయమింక సాగునా

నెరజాణవులే వరవీణవులే గిలిగించితాలలో
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

రాసలీల వేళ రాయబారమేల

చిత్రం: ఆదిత్య 369
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వెన్నెలకంటి
నేపథ్య గానం: యస్ పి బాలు & యస్ జానకి

రాసలీల వేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేల

కౌగిలింత వేడిలో కరిగె వన్నె వెన్నలా
తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల
మోజులన్ని పాడగా జాజిపూల జావళీ
కందెనేమో కౌగిట అందమైన జాబిలి
తేనెవానలోన చిలికె తీయనైన స్నేహము
మేనివీణలోన పలికె సోయగాల రాగము
నిదురరాని కుదురులేని యెదలలోని సొదలు మాని

మాయజేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తీయని పాయిపూల జల్లులు
చేరదీసి చెంతకు భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు యీ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల వూయలూగనా
చూపు ముళ్ళు వోపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువనీదు

Saturday, May 05, 2007

బొమ్మని గీస్తే నీలా వుంది

చిత్రం: బొమ్మరిల్లు (2006)
సాహిత్యం: భాస్కరభట్ల
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నేపథ్య గానం: జీన్స్ శ్రీనివాస్ & గోపికా పూర్ణిమ

బొమ్మని గీస్తే నీలా వుంది
దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లే పాపం అని దగ్గరకెళితే
దాని మనసే నీలో వుందంది
ఆ ముద్దేదో నీకే యిమ్మంది
సరసాలాడే వయసొచ్చింది
సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలనే నాకూ వుంది
కానీ సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే వుందంది

చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది
వెచ్చని కౌగిలిగా నిను అల్లుకుపొమ్మంది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండి
శ్రమపడిపోకండి తమ సాయం వద్దండి
పొమ్మంటావేఁ బాలికా ఉంటానంటే తోడుగా
అబ్బో యెంత జాలిరా తమరికి నామీద
ఏం చేయాలమ్మ నీలో యేదో దాగుంది
నీ వైపే నన్నే లాగింది

అందంగా వుంది తనవెంటే పదిమంది
పడకుండా చూడు అని నా మనసంటుంది
తమకే తెలియంది నా తోడై వొకటుంది
మరెవరోకాదండి అంది నా నీడేనండి
నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకీ
హయ్యో! అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాట కోసం యెన్నాళ్లుగా వేచుంది
నా మనసు యెన్నో కలలే కంటుంది

బొమ్మని గీస్తే నీలా వుంది
ఊఁహూఁ
దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
ఆహహహహ
సర్లే పాపం అని దగ్గరకెళితే
దాని మనసే నీలో వుందంది
ఆ ముద్దేదో నీకే యిమ్మంది
దాని మనసే నీలో వుందంది
ఆ ముద్దేదో నీకే యిమ్మంది