Friday, August 31, 2007

ఒలెంపిక్ క్రీడల్లో పేకాటకే పెద్దపీట వేస్తే

చిత్రం: ఈ అబ్బాయి చాలా మంచోడు (2002)
సంగీతం, నేపథ్య గానం: మరకత మణి కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్

ఒలెంపిక్ క్రీడల్లో పేకాటకే పెద్దపీట వేస్తే
ఒసామా బిన్ లాడెన్ అన్నమయ్య వీసీడీ చూస్తుంటే
మడోన్నా మావూళ్ళమ్మ జాతరకొచ్చి ఫోకుసాంగు కొడితే
సహారా ఎయిర్లైన్సుకే సత్తెనపల్లి సంతలోన ఆఫీసే తెరిచేస్తే... విడ్డూరం

గులాబీ రేకుల్తో గుండెజబ్బుకే మందే కనిపెడితే
జిలేబీ పానకంతో నడిచే కారులు ఇండియాకి వస్తే
మసాలాదోశలమీద పచ్చడిమీద పీహెచ్ డీ చేస్తే
పొలంలో దుక్కిని దున్నే రైతుకు సైతం లక్షల్లోనే సెల్లుబిల్లు వస్తే... విడ్డూరం

సినీతారలు వానపాటలో నాభి చూపకుంటే... బొడ్డూరం
సిటీరోడ్లపై యమాస్పీడులో పడవలు వెళుతుంటే... తెడ్డూరం
బందరులోని మిఠాయికొట్లో స్వీటే లేకుంటే... లడ్డూరం
బాఁడీలోని రక్తం రంగు బ్లేఁకే ఐపోతే... రెడ్డూరం
తెలుగుఫిల్ములో తెలుగుపాటలు తెలుగుతెలిసిన తెలుగువాళ్ళతో యీరోజుల్లో పాడించారంటే... విడ్డూరం

కరెంటు బల్బులపై మిణుగురు పురుగులు యుద్ధం ప్రకటిస్తే
సిమెంటు రేకులతోటి కాకులు చిలకలు గూళ్ళు కట్టుకుంటే
కొమ్మపై కోకిల గొంతుకి జలుబేచేసి విక్సు వాడుతుంటే
నాన్ వెజ్ తినడం నేను మానేశానని పులి కుందేలుకి ఫోనుచేసి చెబితే... విడ్డూరం

పుంజూ పెట్టా సరసమాడగా ఆమ్లెట్ పుడుతుంటే... గుడ్డూరం
తెలుగుభాషలో అక్షరాలుగా ఎక్స్,వై లే వుంటే... జెడ్డూరం
ఉగాదిపచ్చడి చిల్లీచికెను కలిపే వడ్డిస్తే... ఫుడ్డూరం
డన్లప్ కంపెని తాటాకులతో చాపలు చేస్తుంటే... బెడ్డూరం
సోమవారము మొదలుపెట్టిన చిత్రహింసల టీవీ సీరియల్ మంగళవారమె ముగింపుకొచ్చేస్తే... విడ్డూరం

Monday, August 27, 2007

చందమామ కన్నుకొట్టె సందెవేళ

చిత్రం: దొంగల్లుడు (1993)
సంగీతం: రాజ్, కోటి
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
నేపథ్య గానం: బాలు, చిత్ర

చందమామ కన్నుకొట్టె సందెవేళ
సిగ్గు మల్లెపూలుపెట్టె చీకటేళ
మంచెకాడుంది రావే పంచదార మాపటేళ
తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ
అందమంత ఆరబెట్టి పైటజారె
కోడెగాలి కొట్టగానె కోకజారె
పడలేనీ ఆరాటం
చందమామ కన్నుకొట్టె సందెవేళ
సిగ్గు మల్లెపూలుపెట్టె చీకటేళ
మంచెకాడుంది రారా పంచదార మాపటేళ
తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ

జాజి మల్లి మంచు నీకు జల్లుకుంటా
కొత్త నాగమల్లితీగలాగ అల్లుకుంటా
వాలింది పొద్దు
వడ్డించు ముద్దు
తప్పులెన్ని చేసుకున్నా వొప్పుకుంటా
నువ్వు తప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా
కౌగిళ్లు పట్టు
కవ్వింత కొట్టు
నిషా కళ్ల నీడలో హుషారైన వో కల
రసాలమ్మ కోనలో పసందైన ఆకలా
చలి తీరాలీ సాయంత్రం
చందమామ కన్నుకొట్టె సందెవేళ
సిగ్గు మల్లెపూలుపెట్టె చీకటేళ
మంచెకాడుంది రావే పంచదార మాపటేళ
తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ

మొక్కజొన్నతోటకాడ మొక్కుకుంటా
పాలబుగ్గలోని మొగ్గలన్ని యిచ్చుకుంటా
జాబిల్లి జంట
జాగారమంట
చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా
నీకు బిఱ్ఱుపట్టు రైకలెట్టి చూసుకుంటా
శ్రీకంచిపట్టు
స్త్రీ కన్నుకొట్టు
గులాబీల తోటలో కులాసాలు పండనీ
పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడనీ
చిలకమ్మా నీ కోసం
చందమామ కన్నుకొట్టె సందెవేళ
సిగ్గు మల్లెపూలుపెట్టె చీకటేళ
మంచెకాడుంది రారా పంచదార మాపటేళ
తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ
అందమంత ఆరబెట్టి పైటజారె
కోడెగాలి కొట్టగానె కోకజారె
పడలేనీ ఆరాటం

Tuesday, August 14, 2007

సిగలో అవి విరులో

చిత్రం: మేఘసందేశం (1982)
సాహిత్యం: దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి
సంగీతం: రమేశ్ నాయుడు
నేపథ్య గానం: కట్టాసెరి జోసెఫ్ యేసుదాస్

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో

ఎదుట నా యెదుట యేవో సోయగాల మాలికలు
మదిలోన గదిలోన మత్తిలిన కొత్త కోరికలు
నిలువనీవు నా తలపులు మరీ మరీ ప్రియా ప్రియా
నిలువనీవు నా తలపులు నీ కనుల ఆ పిలుపులు

జరిగి యిటు వొరిగి పరవశాన యిటులే కరిగి
చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగి
మరలి రాలేవు నా చూపులు మరీ మరీ ప్రియా ప్రియా
మరలి రాలేవు నా చూపులు మధువుకై మెదలు తుమ్మెదలు