Tuesday, September 11, 2007

అభిమతము అభినయము

చిత్రం: జయమ్ము నిశ్చయమ్మురా (1990?)
సంగీతం: రాజ్, కోటి
సాహిత్యం: జొన్నవిత్తుల ?
నేపథ్యగానం: బాలు, సుశీల

అభిమతము అభినయము యీ ప్రేమ చతురాతి చతురం
చలిలో రేగును సెగలే
ఎదలో మోగును లయలే
ఇది పెళ్లికి పిచ్చికి నడుమ విచిత్రం
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతి మధురం
మనసే మమతకు జోడై
మమతే మనిషికి నీడై
ఇటు సాగిన స్నేహమె మైత్రికి అందం

కోటినవ్వుల గూటిగువ్వవు
గోట మీటగానే మోగు వీణవు
కోమలి కో అంటే ఆరును యెదమంట
భామిని నో అంటే బాధలు మొదలంట
సరి అనవా వరమిడవా సరసన నవరసమధురసమీవా

మండుటెండలో మంచుకొండవై
స్నేహసుధలలోనా భాగమందుకో
ఒంటరిమనుగడలో వూరట కలిమేలే
బాధలసుడివడిలో బాసట బలిమేలే
వేడుకలో వేదనలో తోడుగనిలిచెడి స్నేహమె సంపద

Monday, September 10, 2007

ఒట్టేసిచెబుతున్నా

చిత్రం: ఒట్టేసిచెబుతున్నా (2003)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: ?
నేపథ్య గానం: గోపాల్, శ్రీనిధి

ఒట్టేసిచెబుతున్నా వింటున్నావా ఓ మైనా నువ్వంటే నేనేనని
అడుగేసి వస్తున్నా యెందాకైనా యేవైఁనా నీ వెంటే వుండాలని
తీరిందమ్మా ఆరాటం దొరికిందమ్మా ఆధారం
నీవల్లే మారిందే నా జాతకం
అందిందమ్మో అనుబంధం యేవో జన్మల ఋణబంధం
నీ వొళ్ళో వాలిందే నా జీవితం

వెళ్ళేటిదారుల్లోన నీడుంటే చాలనుకుంటే బంగరుమేడై కలిసొచ్చావే
వేచేటి కన్నుల్లోన కలలుంటే చాలనుకుంటే కమ్మని నిజమై కనిపించావే
దీవెన చాలని అనుకుంటే దైవం అందెనే
పూజకు రమ్మని పిలుపిస్తే ప్రాణం పంచెనే
నా రాతే మార్చేసే నా గీతే దిద్దేసే భామిని వుండగ బ్రహ్మెందుకో

నీ లేతపాదాలంటే ధూళైతే చాలనుకుంటే పాపిటతిలకమే చేశావమ్మా
నీ పెరటితోటల్లోన గాలైతే చాలనుకుంటే వూపిరిలో నను నిలిపావమ్మా
నాలో నేడే వెలిగిందే ఆశాదీపము
ప్రేమే మనకు అందించే ఆశీర్వాదము
నీ మెళ్ళో ముళ్ళేసి పల్లెల్లో యిల్లేసి జతపడి బ్రతకని జన్మెందుకో

Tuesday, September 04, 2007

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో

చిత్రం: ప్రియరాగాలు (2000)
సంగీతం: మరకతమణి కీరవాణి
సాహిత్యం: చేంబోలు "సిరివెన్నెల" సీతారామశాస్త్రి
నేపథ్య గానం: చిత్ర, బాలు

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో
ప్రేమజంటను కలిపిందెవరే పూలతోటల్లో
కోకిలమ్మను కూయమంటూ పల్లెవీణను మీటమంటూ
కళ్యాణిరాగాల వర్ణాలలో

నీ పాట తేట తేట తెలుగు పాట
చల్లనమ్మ చద్దిమూట
అన్నమయ్య కీర్తనల ఆనందకేళిలా
నీ బాట గడుసుపిల్ల జారుపైట
గండుమల్లెపూలతోట
పల్లెటూరి బృందావనాల సారంగలీలగా
చిరుమబ్బుల దుప్పటిలో ముసుగెట్టిన జాబిలిలా
నునువెచ్చని కోరికనే మనువాడిన చల్లని వెన్నెలలా
కోడికూసేవేళదాకా వుండిపోతే మేలు అంటూ
గారాలబేరాలు కానిమ్మంటూ

ఉయ్యాల ఊపిచూడు సందెవేళ
పిల్లగాలి శోభనాల
కొండనుంచి కోనవొడికి జారేటి వాగులా
జంపాల జామురాతిరైనవేళ
జాజిపూలజవ్వనాల
జంటకోరి జాణపాడే జావళీపాటలా
గోపెమ్మలు కలలుకనే గోవిందుని అందములా
రేపల్లెకు వూపిరిగా రవళించిన వేణువుచందంలా
హాయిరాగం తీయమంటూ మాయచేసి వెళ్ళమంటూ
నాదాల తానాలు కానిమ్మంటూ

Monday, September 03, 2007

విన్నపాలు చేసుకోనా

చిత్రం: ఖైదీగారు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: ???
నేపథ్య గానం: బాలు, చిత్ర

విన్నపాలు చేసుకోనా యిల్లాలికి సన్నజాజులిచ్చుకోనా
బుగ్గచుక్క పెట్టుకోనా యీ రాతిరి సిగ్గుపాలు పంచుకోనా
కాలమే కౌగిలై ఆగిపోనీ అహో
స్వర్గమే గుండెలో దాగిపోనీ అహో
పరువంపు వంపు మురిపాల తొలకరిలో

ఏడాదిలో నా యింటిలో పండువంటి బాబే నీకు కలుగుతాడుగా
ఉంగ ఉంగ సంగీతాలే మనకు తోడుగా
చెలీ, గారాబాలవేళ నువ్వే చంటిపాపవే
ఇక వందయేళ్ళదాకా మీరే కంటిపాపలే
పుణ్యమేదో చేసినాను
పూజచేసి పొందినాను
గతజన్మలన్ని శతకోటి ముడుపులుగా

ఏ కోరికా నే కోరను, నీడలాగ మీతో వుండే బ్రతుకు చాలును
తల్లిప్రేమ నీతో నాకు నేడు తెలిసెను
మరీ అంతమాట అంటే నేను తట్టుకోనుగా
నిను గుండెగూటిలోన దాచుకుంటి మేనుగా
శ్వాస నీవే మేను నాది
ఇంక నాకు లేనిదేది
ఎడబాటు లేదు మరియేడు జన్మలకి