Saturday, October 27, 2007

జారిపోయెనా? నీ చేయి జారెనా?

చిత్రం: అబద్ధం (2006)
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: విద్యాసాగర్
నేపథ్య గానం: చిత్ర?

జారిపోయెనా? నీ చేయి జారెనా?
తెలుగురాని కొత్తతరంలా!
నీరు లేని తెలుగుజనంలా!
యువతిలేని యువకునిలాగా!
దయమరచిన దైవంలాగా!

శౌర్యంలేని ఖడ్గంలాగా
నీరుడిగిన నేలతల్లిలా
తూర్పెరగని సూర్యుడిలాగా
హద్దుచెరిగి దేశంలాగా

తెల్లని ఇసకను మథనం చేస్తే మనసే పుడుతుందా
పై పై వేషం లోపల పాశం కథ నడిపిస్తుందా
నిను పోగొట్టుకుని నిన్నే వెతికేవా
మదిలో ఆశలతో పెదవికి తాళాలా
అరే యెంత పిచ్చిదానివే

చిట్టి చిట్టి కవితన్నేనే

చిత్రం: అబద్ధం (2006)
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: విద్యాసాగర్
నేపథ్య గానం: శాలిని

చిట్టి చిట్టి కవితన్నేనే
సీతాకోకచిలకన్నేనే
చుక్క రెక్కల పువ్వును నేనే
సైగలు చేసే వాగును నేనే
జడివానకు గొడుగై
సెలయేటికి అలనై
తొలిపాటకు పదమై
దేవుడికొక వరమై

ఆహా చల్లగాలీ యిలా వీస్తే నీ తోటి సైయాటలే ఆడనా
అరరె యీ భూమి నా తల్లీ జగమంతా జోలాలి సంకీర్తనా
కన్నుకొట్టి ఆశపుడితే యెండకన్ను నేను కొట్టనా
వానవిల్లు చీరకట్టనా అమ్మమ్మమ్మమ్మమ్మో
మేఘాలన్నీ నాకే సొంతం
మల్లెపూల చందమామ చెల్లెలంటు పాలబుగ్గే గిల్లి ఆనందంలో

మీసం నాకు లేదు లేకపోతే యేం దోషం నేనాడ గురజాడనే
ఆసలే ఆశలేదు అయితేయేం యేనాడో సేవే కదా నా మతం
చిట్టిపూల చెట్లనవ్వులే రంగురంగు పుస్తకాలులే
నేలమీద స్వర్గముందిలే అమ్మమ్మమ్మమ్మమ్మో
ఝల్లని పొంగే జావళి జతిలో
గజ్జెకట్టి కృష్ణవేణి ఘల్లుమంటు ఆట ఆడే పాడే ఆనందంలో