చిత్రం: రాజ్‌కుమార్ (1983)
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
సంగీతం: ఇళైయరాజా
నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల
ప్రధాననటులు: శోభన్‌బాబు, జయప్రద
జానకి కలగనలేదు రాముని సతికాగలనని యేనాడూ
రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు
ఆనాడు యెవరూ అనుకోనిది
ఈనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం మన జీవన పారాయణం
చెలి మనసే శివధనుసైనది తొలిచూపుల వశమైనది
వలపు స్వయంవరమైనపుడు గెలువనిది యేది?
ఒక బాణం వొక భార్యన్నది శ్రీరాముని చిరయశమైనది
శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావి
తొలిచుక్కవు నీవే చుక్కానివి నీవే
తుదిదాకా నీవే మరుజన్మకు నీవే
ఆ...
సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం
ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం
సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం
ప్రతిరోజూ వొక శ్రీకారం పరవశ శృంగారం
గతమంటే నీవే కథకానిది నీవే
కలలన్నీ నావే కలకాలం నీవే
ఆ...
***
రాగం: శుద్ధసావేరి
సా, ప మ - సా స ప ప మ రీ
జానకి - కలగనలేదు
సా ప మ - స స స ప మా రీ
రాముని - సతికాగలనని
సా సా సా
ఏనాడూ
స రి మా ప - దా దా ప మ రీ
ఆనాడు - యెవరూ
స రి మా ప దా
అనుకోనిదీ
ద ప - మ ప దా, స రీ
ఆ - రామాయణం
స స - దా సా దా పా - పా మా రి సా
మన - జీవన - పారాయణం ...
స స స స రి స - ద ద రి స దా ప ప
చెలి మనసే - శివధనుసైనది
ప ప పా ద ప - దా ద ద రి స దా
తొలి చూపుల - వశమైనదీ
పా ప ప పా - మ ప దా పా
గెలువనిదీ - యేదీ
దా దా ద ప - మ ప ద స దా
తొలిచుక్కవు - నీవే
దా దా ద ప - మ ప దా ప మ రీ
చుక్కానివి - నీవే
సా రి రి మ - మ పా ప - రీ మ మ ప - ప దా ద - మా ప ప ద - ద స స రి - రీ
ఆ....
Tuesday, December 25, 2007
Subscribe to:
Posts (Atom)