చిత్రం: పెళ్ళి పుస్తకం (1991)
సంగీతం: కే వీ మహాదేవన్
సాహిత్యం: ఆరుద్ర
నేపథ్యగానం: బాలు & సుశీల
శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
తలమీద చెయ్యివేసి వొట్టు పెట్టినా
తాళిబొట్టు మెడనుకట్టి బొట్టు పెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం
అడుగడుగున తొలిపలుకులు గుర్తుచేసుకో
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో
ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని
మసకేయని పున్నమిలా మనికి నింపుకో
Subscribe to:
Post Comments (Atom)
0 అభిప్రాయాలు:
Post a Comment