Monday, May 05, 2008

ఏడుమల్లెలెత్తు సుకుమారికి

చిత్రం: సిందూరం (1997)
సంగీతం: శ్రీనివాస్ చక్రవర్తి
సాహిత్యం: చంద్రబోస్
నేపథ్యగానం: కృష్ణం రాజ్, మాధవపెద్ది సత్యం, ప్రదీప్

ఏడుమల్లెలెత్తు సుకుమారికి యెంత కష్టవొఁచ్చింది నాయనో
భోగిపళ్ళు పొయ్యాలి బేబికి యేవిఁ దిష్టి కొట్టింది నాయనో
ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చెవఁట్లు పట్టాయిరో
మంచుబొట్లు ఆ బుగ్గలో అగ్గిచుక్కలైనాయిరో

పాతమంచవిఁదిగో పట్టుకొచ్చినానురో భగ్గుమంటు మండుతాదిరో
పేకతల్లిరో పీకులాడమందిరో సందు చూసి సద్దుకోరో హోయ్
బోడిజుత్తు వుందని కోడిపుంజు కావురో కాలుదువ్వి రాకయ్యో
వెక్కిరించినా యెంత చక్కగుంటవే నా పడుచు పావురాయో
అలా మాయమాటలాడితె ఐసైపోనయ్యా
బలాదూరు మానకుంటె భరతం పడతడు మా మావఁయ్య
హరిలోరంగహరీ చూడరో దీనల్లరి
గాదెలో నిండే వరి వీధిలో చిందే సిరి
సువ్వి సువ్వి గొబ్బిళ్ళ పాటకి నవ్వి నవ్వి తాళాలు వెయ్యరో

ఎంత గోలపెట్టినా నెత్తివీఁదకొచ్చెరో కుంకుడు స్నానాలూ
చింతమొద్దులా అంత నిద్దరేందిరా యేవాఁయె పౌరుషాలూ
ఎవుఁకలు కొరికే యీ చలిపులినీ చెవఁటలు కక్కించరో
అహ మంచుకడ్డీలా వున్న రేయిని మంటపాలు చెయ్యి లేవో
ప్రతీ యింట బూరెలవంట మహబాగుంది సరే
కనుం దాక కక్కా ముక్కా దొరకదు అది వొక లోటే గదరో
సంకురాత్రి పండగొచ్చెరో సంబరాలు తెచ్చేనురో
గంగిరెద్దు యింటకొచ్చెరో గంగడోలు దువ్వి పంపరో
తెలుగింట లోగిళ్లలోనికి పెద్దపండగొచ్చింది చూడరో
కిలకిల సందళ్ళ కోయిల కొత్త పొద్దు తెచ్చింది చూడరో

0 అభిప్రాయాలు: