చిత్రం: గౌతం SSC (2005)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చేంబోలు "సిరివెన్నెల" సీతారామశాస్త్రి
నేపథ్యగానం: శ్రేయా ఘోషాల్
ఏదో ఆశ యెదలో మొదలైనది యెపుడూ జాడ లేనిది
నిజం తెలుసా యీనాటిది కాదది యిపుడే మేలుకొన్నది
ఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్నల్లుకుంది నిశీథిలో వుషోదయంలా
నీ లాలిని పాడే లాలన నేను
జాబిలికై ఆశపడే బాలను నేను
తల్లిగా జోకొట్టి చలువే పంచాలోయ్
చెలిగా చేపట్టి చనువే పెంచాలోయ్
సరిగా నాకే యింకా తేలని యీ వేళ
నీ నీలి కన్నుల్లో వెతుకుతు వున్నా
క్షణానికో రూపంలో కనబడుతున్నా
జాణనై నా వెంట నిను నడిపించాలోయ్
జానకై జన్మంతా జంటగా నడవాలోయ్
తెలిసీ తెలీనట్టే వుందే యీ లీల
Monday, May 05, 2008
Subscribe to:
Post Comments (Atom)
0 అభిప్రాయాలు:
Post a Comment