చిత్రం: సంతోషం (2002)
సాహిత్యం: చేంబోలు సీతారామశాస్త్రి
సంగీతం: ఆర్ పీ పట్నాయక్
నేపథ్యగానం: రాజేష్ & ఉష
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో శ్రుతి కలిపి పాడగా
నీ నీడలో అణువణువు ఆడగా
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా
నువ్వు నావెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కలా నిజమల్లె కనిపించదా
నిన్నిలా చూస్తూ ఉంటే మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా
వరాలన్ని సూటిగా ఇలా నన్ను చేరగా
సుదూరాల తారక సమీపాన వాలగా
లేనేలేదు ఇంకే కోరిక
ఆగిపోవాలి కాలం మనసొంతమై ఎల్లకాలం
నిన్నగా సనసన్నగా చేజారిపోనీయక
చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగా మన పాపగా పుడుతుంది సరికొత్తగా
నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా
ప్రతీరేయి తీయగా పిలుస్తోంది హాయిగా
ఇలా ఉండిపోతే చాలుగా
Sunday, May 11, 2008
Subscribe to:
Post Comments (Atom)
0 అభిప్రాయాలు:
Post a Comment