చిత్రం: పెళ్ళిపుస్తకం (1991)
సాహిత్యం: ఆరుద్ర అనబడే భాగవతుల సదాశివశఙ్కరశాస్త్రి
సంగీతం: కే వీ మహాదేవన్
నేపథ్య గానం: శ్రీపతిపణ్డితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యము
సరికొత్త చీర ఊహించినాను సరదాల సరిగంచు నేయించినాను
మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెలరాశికి సిరిజోత
ముచ్చటగొలిపే మొగలిపొత్తుకు ముల్లూ వాసనా ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు అలకా కులుకూ ఒక అందం
నీ అందాలన్నీ కలబోశా నీ కొంగుకు చెంగును ముడివేస్తా
చురచుర చూపులు ఒకమారు నీ చిరుచిరు నవ్వులు ఒకమారు
మూతివిరుపులు ఒకమారు నువు ముద్దుకు సిద్ధం ఒకమారు
నువు ఏ కళనున్నా మాబాగే ఈ చీర విశేషం అల్లాగే
Thursday, June 19, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 అభిప్రాయాలు:
రాఘవా, నీ ఉత్సాహానికి నా అభినందనలు
Post a Comment