చిత్రం: ఓ సీత కథ (౧౯౭౪)
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: కె వి మహాదేవన్
గానం: బాలసుబ్రహ్మణ్యం & సుశీల
మల్లెకన్న తెల్లన మా సీత సొగసు
వెన్నెలంత చల్లన మా సీత సొగసు
ఏది
తేసెకన్న తీయన మా బావ మనసు
తెలుగంత కమ్మన మా బావ మనసు
నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి
ఏమని
కన్నెసీత కలలన్నీ పండేది ఎపుడని
నీతోనే ఒక మాట చెప్పాలి
ఏమని
నీతోడే లేకుంటే ఈ సీతే లేదని
మనసుంది ఎందుకని
మమతకు గుడిగా మారాలని
వలపుంది ఎందుకని
ఆ గుడిలో దివ్వెగ నిలవాలని
మనువుంది ఎందుకని
ఆ దివ్వెకు వెలుగైపోవాలని
బ్రతుకుంది ఎందుకని
ఆ వెలుగే నీవుగ చూడాలని
Tuesday, November 18, 2008
Subscribe to:
Post Comments (Atom)
0 అభిప్రాయాలు:
Post a Comment