చిత్రం: నీరాజనం (1989)
సంగీతం: ఓ పీ నయ్యర్
సాహిత్యం: సింగిరెడ్డి నారాయణరెడ్డి
నేపథ్యగానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యము, ఎస్ జానకి
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే
ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకుంటిని
ఏ చిరుగాలి కదలాడినా నీ చరణాల శ్రుతి వింటిని
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
నీ జతగూడి నడయాడగా జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నినువీడినా మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం
Friday, April 24, 2009
Friday, April 03, 2009
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
చిత్రం: శ్రీవారికి ప్రేమలేఖ (1984)
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: రమేశ్ నాయుడు
నేపథ్యగానం: జానకి
శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా ప్రియానంద భోజా
మీ శ్రీ చరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి
మిము వరించి మీ గురించి ఎన్నో కలలుగన్న కన్నె బంగారు
భయముతో భక్తితో అనురక్తితో శాయంగల విన్నపములు
సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ
మసకచీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభముహూర్తాన
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా జో జో
నిదురపోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్లకు రాస్తున్న... ప్రేమలేఖ
ఏ తల్లి కుమారులో తెలియదు కానీ
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగధీరులో తెలియలేదుగానీ
నా మనసును దోచిన చోరులు మీరు
వలచివచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి
చప్పున బదులివ్వండి
తలలోన తురుముకున్న తుంటరి మల్లె
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపె
సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడె
నీ జతనే కోరుకునే లతలాగా అల్లుకునే
నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండి

వర్గాలు:
1984,
జానకి,
రమేశ్ నాయుడు,
వేటూరి
అలకపానుపు ఎక్కనేల
చిత్రం: శ్రీవారి శోభనం (1984)
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: రమేశ్ నాయుడు
నేపథ్యగానం: జానకి
అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక అలక చాలింక
శీతాకాలం సాయంకాలం
అటు అలిగి పోయేవేల చలి కొరికి చంపే వేళ
రామ రామ శబరి బామ్మ నిద్దరేపోదు
రాతిరంతా చందమామ నిదరపోనీదు
కంటి కబురా పంపలేను
ఇంటి గడప దాటలేను
ఆ దోరనవ్వు దాచకే నా నేరమింక ఎంచకే
ఆ దోరనవ్వు దాచకే ఈ నవ్వు నవ్వి చంపకే
రాసి ఉన్న నొసటి గీత చెరపనే లేరు
రాయని ఆ నుదుటి రాత రాయనూ లేరు
నచ్చిన మహరాజు నీవు
నచ్చితే మహరాణి నేను
ఆ మాట ఏదో తెలిపితే నీ నోటి ముత్యం రాలునా
నులక పానుపు నల్లి బాధ పిల్ల చిలకమ్మా అల్లరాపమ్మా
శీతాకాలం సాయంకాలం
నను చంపకే తల్లి జోకొట్టకే గిల్లి

లలితకళారాధనలో వెలిగే
చిత్రం: కళ్యాణి (1979)
సాహిత్యం: సి నారాయణరెడ్డి
సంగీతం: రమేశ్ నాయుడు
నేపథ్యగానం: శ్రీపతిపండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యము
లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను
మధురభారతి పదసన్నిధిలో ఒదిగే తొలి పూవును నేను
ఏ ఫలమాశించి మత్తకోకిల ఎలుగెత్తి పాడును
ఏ వెల ఆశించి పూచే పూవు తావిని విరజిమ్మును
అవధిలేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం
ఏ సిరి కోరి పోతన్న భాగవతసుధలు చిలికించెను
ఏ నిధి కోరి త్యాగయ్య రాగజలనిధులు పొంగించెను
కమనీయ కళావిష్కృతికి రసానందమే పరమార్థం

1979,
బాలు,
రమేశ్ నాయుడు,
సినారె
జోరుమీదున్నావు తుమ్మెదా
చిత్రం: శివరంజని (1978)
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
సంగీతం: రమేశ్ నాయుడు
నేపథ్యగానం: సుశీల
జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒల్లు జాగరతె తుమ్మెదా
ముస్తాబు అయ్యావు తుమ్మెదా కస్తూరి రాసావు తుమ్మెదా
మసక ఎన్నెల్లోన తుమ్మెదా మల్లె పందిరి కాడ తుమ్మెదా
మాల కడుతున్నావు తుమ్మెదా ఆ మాలెవరికోసమే తుమ్మెదా
మెత్తన్ని పరుపూలు తుమ్మెదా గుత్తంగ కుట్టావు తుమ్మెదా
వత్తైన పరుపుపై తుమ్మెదా అత్తర్లు చల్లావు తుమ్మెదా
పక్క వేసుంచావు తుమ్మెదా ఆ పక్కెవరికోసమే తుమ్మెదా

1978,
దాసం గోపాలకృష్ణ,
రమేశ్ నాయుడు,
సుశీల
శ్రీరామనామాలు శతకోటి
చిత్రం: మీనా (1973)
సాహిత్యం: ఆరుద్ర
సంగీతం: రమేశ్ నాయుడు
నేపథ్యగానం: సుశీల
శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి
తండ్రి ఆనతి తలఁదాల్చు తనయుడు దశరథరామయ్య స్తవనీయుడు
కడు మేటి విలువిఱిచి కలికని చేపట్టు కళ్యాణరామయ్య కమనీయుడు
సుదతి జానకి తోడ శుభసరసమాడేటి సుందరరామయ్య సుకుమారుడు
కోతి మూకలతో లంకపై దండెత్తు కోదండరామయ్య రణధీరుడు
పవమాన సుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు
అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు అచ్యుతరామయ్య అఖిలాత్ముడు

1973,
ఆరుద్ర,
రమేశ్ నాయుడు,
సుశీల
Subscribe to:
Posts (Atom)